- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ నాయకులకు బిగ్ షాక్.. చట్టపరమైన చర్యలకు జనసేన నిర్ణయం
తప్పుడు ప్రచారం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జనసేన బిగ్ షాక్ ఇచ్చింది....

దిశ, వెబ్ డెస్క్: తప్పుడు ప్రచారం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp Congress Party) నాయకులకు జనసేన(Janasena) పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. తమ నాయకుడి పేషీలో సురేష్ అనే వ్యక్తి పని చేయకపోయినా తప్పుడు ప్రచారం చేయడంపై సీరియస్ అయింది. ఈ మేరకు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఉప ముఖ్యమంత్రి పేషీలో లేని సురేష్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లుగా చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ(Ycp) నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ తరపున ప్రకటించారు. గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు, ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా ప్రచారం చేసిన ఈ తప్పుడు వార్తలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వెల్లడించింది. ఈ నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, నిజానిజాలు నిర్ధారించకుండా ప్రచురించిన వారిపై, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ న్యాయ విభాగం సిద్ధమైందని హెచ్చరించారు.






