గిరిజనుల చెంత జనసేన ఆవిర్భావ వేడుకలు.. కాలినడకన పర్యటించిన పవన్ కల్యాణ్

by Ramesh Naini |

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి.

గిరిజనుల చెంత జనసేన ఆవిర్భావ వేడుకలు.. కాలినడకన పర్యటించిన పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి. పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజన గడ్డపై అట్టహాసంగా వేడుకలను నిర్వహించారు. ప్రజల మధ్యే పార్టీ వేడుకలు జరగాలన్న లక్ష్యంతో ఆయన గిరిజన పల్లెలను ఎంచుకోవడం విశేషం.

థింసా నృత్యంతో స్వాగతం.. పార్టీ పతాకావిష్కరణ

ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ఓనూరు నుంచి నందిగరువు వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో జరుగుతున్న పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నందిగరువు చేరుకున్న ఉపముఖ్యమంత్రికి గిరిజన మహిళలు తమ సంప్రదాయ 'థింసా' నృత్యంతో నీరాజనాలు పలికారు. వారి సంస్కృతిని గౌరవిస్తూ పవన్ కల్యాణ్ వారితో ముచ్చటించారు. అనంతరం నందిగరువులో పార్టీ పతాకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.

Next Story