పవన్ కల్యాణ్ పర్యటనల్లో అపరిచిత వ్యక్తి.. ఎస్పీకి ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు...

పవన్ కల్యాణ్ పర్యటనల్లో అపరిచిత వ్యక్తి.. ఎస్పీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan kalyan) ఇటీవల కాలంలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. దీంతో ఆయనను చూసేందుకు పార్టీ కార్యకర్తలే కాదు.. అనుచిత వ్యక్తులు సైతం వస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు సమీపంలో కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఓ వ్యక్తి బ్లేడుతో తన చేతులు కోసేశారంటూ పవన్ కల్యాణే చెప్పడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

అయితే అలాంటి ఘటనకాకపోయినా రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు(Rajolu)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. కొబ్బరి రైతుల కష్టాలు తెలుసుకునే సమయంలో ఓ అపరిచిత వ్యక్తి చొరబడినట్లు గుర్తించారు. అంతేకాదు పవన్ కల్యాణ్‌కు దగ్గరగా సంచరించినట్లు కోనసీమ జిల్లా(Konaseema District) ఎస్పీకి జనసేన కార్యాలయం(Janasena Office) సిబ్బంది ఫిర్యాదు చేసింది. అపరిచిత వ్యక్తి ఓ పార్టీకి చెందినట్లు గుర్తించారు. ఆయన కదిలికలు, కార్యక్రమానికి జారీ చేసిన పాస్‌పైనా సందేహాలున్నట్లు ఎస్పీకి వివరించారు. దీనిపై విచారణ చేపట్టాలని ఎస్పీని కోరినట్లు పేర్కొన్నారు.

Next Story