చంద్రబాబు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : జలీల్ ఖాన్

by Seetharam |

రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మచ్చలేని నాయకుడు చంద్రబాబు. కక్షపూరితంగా కావాలనే చంద్రబాబును అరెస్టు చేసేశారు అని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు.

చంద్రబాబు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : జలీల్ ఖాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మచ్చలేని నాయకుడు చంద్రబాబు. కక్షపూరితంగా కావాలనే చంద్రబాబును అరెస్టు చేసేశారు అని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల అవ్వాలని తాను కోరుకుంటున్నట్ల తెలిపారు. చంద్రబాబు విడుదల ఆకాంక్షిస్తూ బుధవారం జలీల్ ఖాన్ సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్‌ అయిన దగ్గర నుంచి నిరసన దీక్షలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రెండు రోజుల్లో చంద్రబాబు విడుదల కాకపోతే తానూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని హెచ్చరించారు. చంద్రబాబుకే ప్రజలు మద్దతు పలుకుతున్నారు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రారు అని చెప్పుకొచ్చారు. నాలుగేళ్లలో జగన్ సర్కార్ రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. ప్రజల మీద కరెంటు, ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెంచేశారు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై త్వరలోనే తిరుగుబాటు రావడం ఖాయమని జలీల్ ఖాన్ హెచ్చరించారు.

Next Story