- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేశ్‌ను ఏ-1 చేర్చి తక్షణమే అరెస్ట్ చేయాలి: జక్కంపూడి రాజా డిమాండ్
రాష్ట్రంలో నారా లోకేష్ అవినీతి, దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నారా లోకేష్ అవినీతి, దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హెరిటేజ్ సంస్థలో పాలు అమ్ముకున్న చందంగా, ఎంతో పవిత్రమైన డీఎస్సీ (DSC) ఉద్యోగాలను సైతం అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఈ ఉద్యోగాలకు బహిరంగంగా వేలం పాటలు నిర్వహించారని, ఉద్యోగాలు రాక వేలాది మంది నిరుద్యోగులు కన్నీరుమున్నీరవుతున్నా ప్రభుత్వానికి కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాల్లో వేలాది మంది డీఎస్సీ బాధితులు పాల్గొని తమ ఆవేదనను వ్యక్తపరిచారని, నిరుద్యోగుల పక్షాన రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
మంత్రి పదవి నుంచి తొలగించాలి..
ఈ భారీ కుంభకోణానికి బాధ్యుడైన లోకేష్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఆయనను ఏ-1 (A1) నిందితుడిగా చేర్చి తక్షణమే అరెస్ట్ చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేవలం నామమాత్రపు విచారణ సరిపోదని, సీబీఐ (CBI) లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. అప్పుడే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని, ఈ దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు వస్తాయని జక్కంపూడి పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్‌పై విమర్శలు
మరోవైపు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ లక్ష్యంగా జక్కంపూడి రాజా ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలకే పరిమితమైన రీల్ హీరోనా లేక ప్రజా సమస్యలపై స్పందించే రియల్ హీరోనా అనేది ఇప్పుడు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మోసపోయిన నిరుద్యోగ యువతకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు నిజంగానే రాజకీయాల్లో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే... ఈ డీఎస్సీ ఉద్యోగాల విక్రయంపై వెంటనే స్పందించి తన గళాన్ని విప్పాలని జక్కంపూడి రాజా సవాల్ విసిరారు.






