Nara Lokesh:‘జగన్ పాలన.. దళితులకు నరకయాతన’.. మంత్రి లోకేష్ సంచలన ట్వీట్

by Jakkula Mamatha |   ( Updated:2024-12-11 06:31:00.0  )
Nara Lokesh:‘జగన్ పాలన.. దళితులకు నరకయాతన’.. మంత్రి లోకేష్ సంచలన ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వ పాలనపై మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ(YCP) హయాంలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన విమర్శించారు. నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ అంటూనే దళితులను నిండా ముంచారని మండిపడ్డారు. ఈ క్రమంలో గత టీడీపీ(TDP) హయాం(2014-19)తో పోలిస్తే వైసీపీ పాలనలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని మంత్రి లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్(Twitter) వేదికగా స్పందించారు. ‘జగన్ జమానా లో దళితులపై దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. జే బ్రాండ్స్ పై పోరాడినందుకు హత్యలు చేశారు. ఇసుక అక్రమాలపై నోరెత్తినందుకు శిరోముండనం చేశారు. జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా దేశానికి తెలిసింది’ అంటూ మంత్రి నారా లోకేష్(Minister Lokesh) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed