- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan: జగన్ హెలికాప్టర్ డ్యామేజ్!
మాజీ ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది.

దిశ డైనమిక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ (Helicopter) డ్యామేజ్ అయింది. జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు. అక్కడ జగన్ చేరుకునే సమయానికి పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్.. అభిమానులు తరలి వచ్చారు. తిరిగి అదే హెలికాప్టర్ లో జగన్ బెంగళూరు (Benglore) వెళ్లాల్సి ఉంది. అయితే, భారీగా అభిమానులు తరలి వచ్చారు. జగన్ పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య పరామర్శ పూర్తి చేసుకొని వచ్చే సమయానికి హెలికాప్టర్ డామేజ్ కావటంతో.. పైలెట్లు అందులో ప్రయాణానికి తిరస్కరించారు. సరైన భద్రత లేని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ దగ్గర సరిపడా సెక్యూరిటీ (Security) లేదని వైసిపి ఆరోపించింది. వైసీపీ ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. పైలెట్ల సూచనతో రోడ్డు మార్గంలో జగన్‌బెంగళూరుకు వెళ్లిపోయారు. పర్యటనల సమయంలో వైయస్.జగన్‌కు భద్రత ఇవ్వని ప్రభుత్వం సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసులు అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశ పూర్వక చర్యలు ఇప్పటికే వైయస్. జగన్‌కు తగిన భద్రత ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.






