Nara Lokesh: జగన్ ​చూపు.. జైలు వైపే.. మంత్రి నారా లోకేశ్ ​కీలక వ్యాఖ్యలు

by Thanuru Gopichand |   (  Updated:2025-04-03 07:16:03  IST  )

జగన్​చూపు ఎప్పుడూ జైలు వైపే ఉంటుందని మంత్రి నారా లోకేశ్​ విమర్శించారు.

Nara Lokesh: జగన్ ​చూపు.. జైలు వైపే.. మంత్రి నారా లోకేశ్ ​కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : జగన్​చూపు ఎప్పుడూ జైలు వైపే ఉంటుందని మంత్రి నారా లోకేశ్​ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అందుకే ప్రజల్లో తిరగలేకపోతున్నాడని తెలిపారు. మాతో ధీటుగా పోటీపడలేక కుల మత ప్రాంత విభేదాలను రెచ్చగొడుతున్నారని లోకేశ్​ అన్నారు. అలా వైసీపీ (YCP) లబ్ధి పొందాలనేది వైసీపీ లక్ష్యం అన్నారు. పాస్టర్​ప్రవీణ్​దే కాదు ముందు ముందు ఇంటువంటి అనేక డ్రామాలు వైసీపీ చేస్తుందన్నారు. తప్పు చేసిన ఎవరినీ వదిలేది లేదన్నారు. రెడ్​బుక్​లో ఏముంది... ? ఎవరైతే చట్టాల్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెడతారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్​కు పవన్​ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉందన్నారు. ఏ రోజు ఆయన గేటుకు తాడు కట్టలేదన్నారు. రెడ్ బుక్ (Redbook)చూసి ఒకరికి గుండె పోటు, మరొకరికి చెయ్యి ఇరిగిందనీ లోకేష్ చురకలు వేశారు. కార్యక్రమంలో లోకేష్ తో పాటు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు

పేద ప్రజలకు.. ‘పట్టా’భిషేకం

దశాబ్ధాలుగా మంగళగిరి (mangalagiri) నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఒక జఠిల సమస్యకు మంత్రి నారా లోకేష్ 10నెలల్లోనే పరిష్కారం చూపారు. మంగళగిరి నియోజకవర్గంలో వేలాదిమంది పేద ప్రజలు దశాబ్ధాలుగా ప్రభుత్వ స్థలాల్లో చిన్న ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. తమకు పట్టాలు ఇప్పించాలని ఏళ్లతరబడి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎన్నికల సమయంలో ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. తాము ఉంటున్న స్థలాలకు శాశ్వత హక్కు కల్పించాలని విన్నవించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతానని ఆనాడు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఇచ్చిన హామీ అమలు కోసం మంత్రి లోకేష్ కార్యాచరణ ప్రారంభించారు. గత పదినెలలుగా అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, రైల్వే శాఖల అధికారులతో మంత్రి లోకేష్ నిరంతరం చర్చలు జరిపారు. డిల్లీ పర్యటనకు వెళ్లినపుడు సైతం రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్, ఇతర రైల్వే అధికారులతో మాట్లాడి తమ నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న రైల్వేభూములను పేదలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ చొరవతో దీర్ఘకాలంగా పేదలు ఎదుర్కొంటున్న మొండి సమస్యకు తొలిదశ పరిష్కారం లభించింది. ఈ రోజు ఉదయం మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో మంత్రి నారా లోకేశ్​ అందజేశారు. నారా లోకేష్ స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Next Story