జనంలోకి జగన్.. రేపు గుంటూరు మిర్చియార్డుకు..?

by Thanuru Gopichand |

మాజీ సీఎం వైఎస్​జగన్​ఇక జనంలోకి రానున్నారా..? ప్రజాపక్షాన పోరాటానికి సిద్ధం అవుతున్నారా..?

జనంలోకి జగన్.. రేపు గుంటూరు మిర్చియార్డుకు..?
X

దిశ డైనమిక్ బ్యూరో : మాజీ సీఎం వైఎస్​జగన్​ఇక జనంలోకి రానున్నారా..? ప్రజాపక్షాన పోరాటానికి సిద్ధం అవుతున్నారా..? జగన్​రేపు గుంటూరు మిర్చి యార్డుకు రానున్నట్లు సోషల్​మీడియాలో వైసీపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అక్కడి ఆయన రైతులను పరామర్శించి అన్నదాతకు గిట్టుబాటు ధరపై ప్రెస్మీట్ పెట్టనున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై పార్టీ ఇంతవరకు ప్రకటన చేయలేదు. వారం రోజుల కిందట యార్డు వద్ద రైతులు ధర్నాకు దిగారు. వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కంటే సగానికి సగం ధర తగ్గించారని తెలిపారు. గత ఏ ఏడాది ఇదే సమయానికి క్వింటాలు రూ.18వేలు ఉండగా ఇప్పుడు రూ.10వేల లోపే ఉందన్నారు. ఇదే విషయమై రైతుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జగన్​గుంటూరుకు రానున్నట్లు సమాచారం. ఈ రోజు ఆయన విజయవాడ సబ్​జైలులో ఉన్న వల్లభనేని వంశీతో ములాఖత్​ అయ్యారు.

Next Story