ఇవాళ‌ సీబీఐ కోర్టుకు జగన్ !

by velandi.Saikiran |   (  Updated:2025-11-20 01:13:59  IST  )

వైయస్ జగన్ సీబీఐ కోర్టుకు రాబోతున్నారు. అక్రమ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హైదరాబాద్‌కు జగన్ వస్తున్నారు

ఇవాళ‌ సీబీఐ కోర్టుకు జగన్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు రాబోతున్నారు. అక్రమ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హైదరాబాద్‌కు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు సమయంలో సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారని ప్రాథమిక సమాచారం.

తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేటకు జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఆ తర్వాత బేగంపేట నుంచి నేరుగా సీబీఐ కోర్టుకు వెళ్లి, సాయంత్రం నేరుగా బెంగుళూరు వెళ్లే ఛాన్స్ ఉందట. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ కు జగన్ వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల హడావిడి మొదలైంది. జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని కార్యకర్తలు, నేతలు ప్లాన్ చేస్తున్నారట.

Next Story