వెలుగుతున్న దీపాలను ఆర్పడమే మీ పనా?: జగన్

by Gantepaka Srikanth |

దీపావళి వేళ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తీవ్ర విమర్శలు చేశారు.

వెలుగుతున్న దీపాలను ఆర్పడమే మీ పనా?: జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి వేళ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా?.. అసలు మీ పాలనలో ఎవరైనా సంతృప్తిగా ఉన్నారా?’’ అని జగన్ ప్రశ్నించారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువకులు అందరినీ మోసం చేశారు. నిరుద్యోగులకు భృతి లేదు.. మహిళలకు ఇస్తామన్న రూ.1500 ఇవ్వట్లేదు.. పెంచిన రూ.4 వేల పెంన్షన్ ఇవ్వట్లేదు.. రైతులకు ఇస్తామన్న రూ.20,000 లేవు.. గ్యాస్ సిలిండర్లు లేవు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించారు. ఇవన్నీ వెలగని దీపాలా? లేక వెలిగించిన అరకొర దీపాలా..? అని అడిగారు. అదీగాకపోతే వైసీపీ పాలనలో దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా? అని ప్రశ్నించారు. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా అని అన్నారు. వైసీపీ పాలనలో 2019-24 మధ్య.. ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అని చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ట్వీట్

Next Story