- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ అసెంబ్లీకి రావాలి.. : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఏపీలో ఎన్ఎస్డీ క్యాంపస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్ఎస్డీ క్యాంపస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్తెలిపారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి ఇవాళ ఆయన హాజరయ్యారు. అనంతరం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆఫీస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్కల్యాణ్విలేకరులతో మాట్లాడుతూ విస్తృత అనుభవం కలిగిన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభలో సార్థకమైన చర్చలు జరగడానికి ఆయన తోడ్పడతారనే నమ్మకం ఉందన్నారు. ఈ అత్యున్నత పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసిన బీజేపీ నాయకత్వం, ఎన్డీఏ మిత్రపక్ష నేతలకు, ప్రధాని మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాయితీలున్న చోటుకే సినీ ఇండస్ట్రీ
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మినీ ఇండియాలా అనిపిస్తోందని పవన్కల్యాణ్పేర్కొన్నారు. తనకు నటన నేర్పిన సత్యమూర్తి దీని గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కళలు లేకపోతే సమాజంలో హింస పెరుగుతుందని అభిప్రా యపడ్డారు. తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదిగిందన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఉందని పేర్కొన్నారు. ఎక్కడ ఎక్కువ సౌకర్యాలు, రాయితీలు ఉంటాయో అక్కడికి ఇండస్ట్రీ వెళ్తుందని తెలిపారు. సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ కూడా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తున్నామని పవన్కల్యాణ్వెల్లడించారు.
వైసీపీ రాజ్యాంగం వేరు..
రాజ్యాంగాన్ని గౌరవించి మాజీసీఎం జగన్ అసెంబ్లీకి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్సూచించారు. వైసీపీ రాజ్యాంగం వేరే ఉండి ఉంటదని వ్యాఖ్యానించారు. అది భారత రాజ్యాంగాన్ని పాటించే తమ ప్రభుత్వంలో చెల్లదని పవన్కల్యాణ్స్పష్టం చేశారు.






