వద్దన్నా వెళుతున్న జగన్​.. గుంటూరులో హైటెన్షన్​

by Thanuru Gopichand |   (  Updated:2025-02-19 05:44:48  IST  )

గుంటూరు నగరంలో హైటెన్షన్​ వాతావరణం నెలకొంది.

వద్దన్నా వెళుతున్న జగన్​.. గుంటూరులో హైటెన్షన్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో : గుంటూరు నగరంలో హైటెన్షన్​ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్​ జగన్ మిర్చియార్డు పర్యటనకు పోలీసులు అనుమతి లేదని ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున అనుమతి లేదంటూ ఎన్నికల కమిషన్​ కూడా వెల్లడించింది. అయితే జగన్​తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డుకు బయలు దేరారు. రాజకీయ సమావేశాలకు అనుమతి లేదని యార్డు అధికారులు కూడా చెబుతున్నారు. అయితే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు ఎన్నికలకోడ్ వర్తించదని మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాము ఎమ్మెల్సీఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు... ప్రచారం చేయట్లేదు.. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడట్లేదనీ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వంకపెట్టి వైయస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఇబ్బంది పెడితే వాళ్లే ఇబ్బంది పడతారు..పోలీస్ అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. మరోవైపు గుంటూరు నగరంలో యార్డు పరిసర ప్రాంతాల్లో మైకులతో ప్రచారం నిర్వహిస్తున్నారు.

Next Story