ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్‌: జగన్

by Gantepaka Srikanth |

మొంథా తుపాన్‌(Cyclone Montha)పై వైసీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్‌: జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాన్‌(Cyclone Montha)పై వైసీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాదాపు 25 జిల్లాలపై మొంథా తుపాన్‌ ప్రభావం చూపిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని చెప్పారు. 11 లక్షల ఎకరాల్లో వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి పంట, 1.15లక్షల ఎకరాల్లో వేరు శనగపంటకు నష్టం జరిగిందని అన్నారు. అంతేగాకుండా.. 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్‌ పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలంతా రైతులకు తోడుగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. కూటమి 16 నెలల పాలనలో 16 విపత్తులు వచ్చాయని విమర్శించారు. ఎంతమంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. ఎంతమంది రైతులను ఆదుకున్నారని అడిగారు. ఇది ప్రక‌ృతి విపత్తు కాదు.. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్‌ జగన్ అన్నారు. పంటనష్టం అంచనాలో రైతులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని జగన్ కోరారు.

Next Story