- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ భవిష్యత్తును నాశనం చేసింది జగనే.. కేంద్ర మంత్రి పెమ్మసాని హాట్ కామెంట్స్
ఆంధ్రుల రాజధాని అమరావతి (Amaravati)ని శిలా శాసనంగా మారుస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి (Pemmasani Chandrashekar Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రుల రాజధాని అమరావతి (Amaravati)ని శిలా శాసనంగా మారుస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి (Pemmasani Chandrashekar Reddy) అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందకు బిల్ కూడా రెడీ అవుతోందని త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదంతో లోక్‌సభలో ఈ సెషల్‌లో లేదా వచ్చే సెషల్‌లో ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు శరవేగంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. సాంకేతిక కారణాలతోనే బిల్లు ఆలస్యం అవుతోందని.. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2014 నంచి రాజధానిగా గుర్తించాలా లేక ఇప్పటి నుంచా అనే దానిపై పూర్తి స్థాయిలో చర్చించాక బిల్లుపై ముందుకు వెళ్తామని అన్నారు. మాజీ సీఎం జగన్ (Jagan) ఇంకా అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారని, ఏపీ భవిష్యత్తును నాశనం చేసింది కూడా ఆయనేనని పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.






