- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం బనకచర్లపై జగన్ కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్న సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్న సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం మరియు గోదావరి జలాలకు సంబంధించి స్పష్టంగా అర్థంగా చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నారు. ఓవైపు కేంద్రం ఇందిరానగర్ ప్రాజెక్టు పురోగతిని అడ్డుకుందని అన్నారు. గోదావరికి చెందిన అనేక ఉపనదులు ఛత్తీస్ గఢ్‌లోని ప్రాణహిత, ఇంద్రావతి, శబరి లాంటివి కేంద్రం సహకారంతో నిర్మించిన పొరుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వల్ల మిగులునీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.
గోదావరికి అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహితను ఎగువన ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇంద్రావతి ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్రం ఛత్తీస్గఢ్‌కు రూ.50వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు పోలవరం వద్ద దిగువకు గూడవల్లి వద్ద గోదావరి మిగులు జలాల లభ్యతను ప్రశ్నార్థకం చేసిందన్నారు. పోలవరం ఆనకట్టల ఎత్తు విషయాల్లో చంద్రబాబు రాజీపడ్డారని విమర్శించారు. ప్రాజెక్టులో తగినంత నీటిని నిల్వ చేయాలేరని చెప్పారు. నీరిని దారి మల్లించడానికి కూడా సాధ్యపడదని అన్నారు. పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యాన్ని నిర్దారించకుండానే బనకచర్ల ప్రాజెక్టు గురించి తొందరపడటం వల్ల ఆర్థికంగా నష్టం జరిగిందన్నారు.






