- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ys Jagan: జగన్ సెక్యూరిటీలో మార్పులు.. కొత్తగా మరో 40 మంది నియామకం?
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి భద్రత పెంచినట్లు తెలుస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) ఇటీవల దూకుడు పెంచారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని వైసీపీ(Ycp) నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు జగన్ భద్రత విషయంపై ఇప్పటికే కేంద్రంతో పాటు సుప్రీంకోర్టు(Supremecourt) దృష్టికి సైతం తీసుకెళ్లారు. అయితే జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరి కల్పిస్తున్నామని అటు ప్రభుత్వం చెబుతోంది. వివిధ ప్రాంతాల్లో జగన్ పర్యటించినప్పుడు స్థానిక పోలీసులు భద్రత కల్పిస్తున్నారని అంటోంది. అంతేకాక మరో 10 మంది మాజీ ఆర్మీ సిబ్బంది సైతం జగన్‌కు భద్రత కల్పిస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో 40 మందితో జగన్‌కు సెక్యూరిటీ పెంచుతున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ కొత్త సెక్యూరిటీ అంతా ప్రైవేటుగానే జగన్‌కు పని చేస్తున్నట్లు చెబుతున్నాయి. కానీ అధికారికంగా ఎక్కడా ప్రకటన రాలేదు. చూడాలి మరి వస్తుందేమో..?.






