- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో తగ్గని వర్షం.. భక్తుల తీవ్ర ఇబ్బందులు
తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుంది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో ఎడతెరిపిలేకుండా వర్షం(Rain) పడుతుంది. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట వర్షపు నీరు నిలిచిపోయింది. కొందరు తడుచుకుంటూనే శ్రీవారి(Lord Venkateswara) దర్శనానికి వెళ్తుంటే. మరి కొందరు గొడుగుల సాయంతో వెళ్తున్నారు. తిరుమలతో పాటు చుట్టుప్రాంతాలు సైతం తడిసిముద్దయ్యాయి. క్యూ లైన్లలో ఉన్న భక్తులు సైతం ఇక్కట్లు పడుతున్నారు. తిరుపతిలోనూ వర్షం పడుతూనే ఉంది. రేణిగుంటలో అయితే కుర్ర కాలువ పొంగి పొర్లుతోంది. రేణిగుంట-పాపానాయుడు మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గుడిమల్లంలోని సీత కాలువకు వరద ఉధృతి పెరిగింది. బొక్కసంపాళ్యంలో మడుగు కాలువకు ఉధృతి కొనసాగుతోంది. స్థానిక పద్మానగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో చాలా చోట్ల ఇక్కట్లు పడుతున్నారు. ఆహారం, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు.






