రెస్టారెంట్లపై పంజా విసిరిన ఐటీ శాఖ.. విశాఖలో నాలుగు చోట్ల సోదాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-08 09:51:42  IST  )

విశాఖ సెలెబ్రేషన్స్ రెస్టారెంట్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇదే రెస్టారెంట్‌కు చెందిన పెందుర్తితోపాటు అక్షయపాలెం, ఎన్ఏడీ, మధురవాడలోని బ్రాంచుల్లోనూ సోదాలు నిర్వహించారు. ....

రెస్టారెంట్లపై పంజా విసిరిన ఐటీ శాఖ.. విశాఖలో నాలుగు చోట్ల సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha) సెలెబ్రేషన్స్ రెస్టారెంట్ల(Celebrations Restaurants)పై ఐటీ అధికారులు (IT officers) దాడులు చేశారు. ఇదే రెస్టారెంట్‌కు చెందిన పెందుర్తితోపాటు అక్షయపాలెం, ఎన్ఏడీ, మధురవాడలోని బ్రాంచుల్లోనూ సోదాలు నిర్వహించారు. ఫుడ్ అమ్మకాలు చేస్తున్నప్పటికీ రికార్డులను డిజిటల్‌‌గా తొలగించినట్లు అధికారులు సేకరించారు. కస్టమర్లు ఆన్ లైన్ పేపేంట్ల ద్వారా చెల్లించిన డబ్బులను పక్కన పెడితే బై హ్యాండ్ చెల్లించే నగదు విషయంలోనే లోపాలున్నట్లు గుర్తించారు. జీఎస్టీ, ఐటీ పన్ను ఎగవేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఓ యాప్ సర్వర్ ద్వారా డేటా సేకరించి.. ఆధికారులు సెలెబ్రేషన్స్ రెస్టారెంట్లలో సోదాలు చేస్తున్నారు.

విశాఖలో నాలుగు చోట్ల తనిఖీలు

ఏకకాలంలో విశాఖలో నాలుగు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ డేటాతో పాటు రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రతి రోజు ఎంత మేర లావా దేవీలు జరుగుతున్నాయని, అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తి స్థాయిలో డేటాను ఆన్ లైన్ చేస్తున్నారా లేదా, బిల్లింగ్ జరుగుతుందా లేదా... జీఎస్టీ, ఐటీ పన్నులు కడుతున్నారా లేదా లనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖతో పాటు రాజమండ్రి, నెల్లూరులోనూ పలు రెస్టారెంట్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సాయంత్రానికి నగదు లావాదేవీలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి, చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story