- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: ఒక్క సారైనా పులస తినాలని అంటారు. అందుకోసం ఎంతైనా వెచ్చించొచ్చని చెబుతారు. కానీ పులస తినాలంటే అన్నీ సీజన్‌లో కుదరదు. ఒక్క వర్షాకాలంలో మాత్రమే సాధ్యమవుతుంది. భారీగా వర్షం కురిసి నదులు ఒకేచోట కలిసి నీళ్లు రంగు మారే సమయంలో పులస పుడుతుందని మత్య్సకారులు చెప్పే మాట. కాబట్టి ఈ సీజన్‌లోనే మాత్రమే పులస దొరుకుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైనీ సీజన్ కొనసాగుతోంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో నదులకు వరద నీరు భారీగా ప్రవహం ఉంది. ఏపీ సరిహద్దులోని గౌతమీ గోదావరిలో మత్య్సకారుల వలకు పులస చేపలు పడుతున్నాయి. తాజాగా మత్య్సకారులు వలకు రెండు పులసలు పడ్డాయి. దీంతో యానాం రాజీవ్ వద్ద పులసలకు వేలం వేయడంతో కేజీ 515 గ్రాములు ఉన్న పులసను మత్య్సకారుడు ఎదులయ్య రూ. 29 వేలు కొనుగోలు చేశారు. కేజీ 400 గ్రాములు ఉన్న మరో పులస రూ. 28 వేలకు వేలంలో మరో వ్యక్తి కొనుగోలు చేశారు. ప్రస్తుతం గౌతమీ గోదావరిలో భారీగా ప్రవాహం ఉందని.. తగ్గిన తర్వాత మరిన్ని పులసలు దొరికే అవకాశం ఉందని వేలంలో పాల్గొన్న వారు అంటున్నారు. చూడాలి మరిన్ని పులసులు దొరుకుతాయేమో...?.






