Nara Lokesh:‘అలా మాట్లాడటం కరెక్ట్ కాదు’.. వైఎస్ జగన్‌ పై మంత్రి ఫైర్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-19 11:16:25  IST  )

ఏపీ మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో భాగంగా వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

Nara Lokesh:‘అలా మాట్లాడటం కరెక్ట్ కాదు’.. వైఎస్ జగన్‌ పై మంత్రి ఫైర్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో భాగంగా వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించడం పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ పోలీసులు కేసు నమోదు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప సినిమాలో డైలాగులు పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అంటూ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

ఈ తరుణంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. కార్యకర్తలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడటం మంచిది కాదని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే ప్లకార్డులను ప్రోత్సహించడమే కాకుండా, అది సినిమా డైలాగ్ అని చెప్పడం దారుణమన్నారు. వైఎస్ జగన్ నక్సలిజం పెరుగుతోందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రజలు తమకు ఐదేళ్ల పాలన కోసం అవకాశం ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చి చూపిస్తామని నారా లోకేష్ తెలిపారు. లిక్కర్ స్కామ్ లో డబ్బు అందుకోలేదని భాస్కర్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేయాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు.

Next Story