- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత వైయస్ జగన్ కు (YS Jagan) రాజధానిపై అవగాహన ఉందో లేదో తెలియట్లేదని మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) విరుచుకుపడ్డారు. ఈ విషయమై శనివారం ఆయన మాట్లాడుతూ అమరావతిపై విషం చిమ్మేలా మాజీ సీఎం మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని అనేక దేశాల రాజధానులు నదుల ఒడ్డునే ఉన్నాయన్నారు. రాజధాని ఏర్పాటు చేసేందుకు జగన్ ప్రయత్నించలేదన్నారు. అమరావతిని ఎడారి, శ్మశానంతో జగన్ పోల్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజధానికి భూములిచ్చిన రైతులను జగన్ అవమానించారన్నారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చివాట్లు పెట్టినా కూడా వైసీపీ అధినేతలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.
రాజధాని రైతులు (Amaravati) జగన్ హయాంలో న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారన్నారు. వారి పాదయాత్రకు కూడా జగన్ అడ్డంకులు సృష్టించారన్నారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. తాము ఏం చేసినా నడుస్తుందని విర్రవీగుతూ.. అధికారంలోకి వస్తామని తప్పులపైన తప్పులు చేశారన్నారు. దీంతో ప్రజలు వైసీపీ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారన్నారు. ప్రజల మనోభావాలను గుర్తించలేపోయామని ఎన్నికల తరువాత స్వయంగా ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అంగీకరించారని తెలిపారు.
వైసీపీ చేస్తున్న క్షుద్ర రాజకీయాలను ప్రజలు గమనించాలని కోరారు. ఆ పార్టీకి రాజ్యాంగం పట్ల గానీ, ప్రజాస్వామ్యం పట్ల గానీ గౌరవం లేదన్నారు. అందుకే ఆ పార్టీ ఆరోపణలు.. విమర్శలను గుర్తెరిగి కూటమి ప్రభుత్వ పక్షాన ప్రజలు నిలవాలని కోరారు.






