ఆ రాత్రి అతలాకుతలం.. కళ్లముందే గాయాలు...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-31 07:44:38  IST  )

విజయవాడపై బుడమేరు విరుచుకుడి సరిగ్గా ఏడాది అవుతోంది...

ఆ రాత్రి అతలాకుతలం.. కళ్లముందే గాయాలు...!
X

దిశ, వెబ్ డెస్క్: సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజుల్లో.. మరిచిపోని గాయం.. విజయవాడ(Vijayawada) ప్రజలకు తగిలింది. ఎప్పుడూ లేనంత బాధపెట్టింది. ఇప్పటికీ దాన్ని తలుచుకుంటే కాళ్లు వణికిపోతాయి. భవిష్యత్తులో మళ్లీ జరగకూడని కోరుకుంటారు బెజవాడ జనం. అంతలా బుడమేరు వాగు బీభత్సం సృష్టించింది. రాత్రికి రాత్రే విరుచుకుపడింది. ఇప్పటికీ కొన్ని కాలనీలు కోలుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఈ వరదలు యావత్తు తెలుగు(Telugu) ప్రజలందరూ గుర్తు పెట్టుకునేలా చేశాయి. ఇప్పటికీ ఆ పేరు వింటే వామ్మో అనక తప్పదు..


ఈ రోజు ఆగస్టు 31. సరిగ్గా ఇదే రోజుల్లో సంవత్సరం క్రితం జరిగిన ఘటనను తలుచుకుంటే ఒళ్లు గగురుపాటుకు గురవ్వాల్సిందే. అంతలా గుర్తుండు పోయేలా చేసింది బుడమేరు వాగు. ఆగస్టు 31కు ముందు రాష్ట్రంలో ఓ వైపు వర్షం.. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడ, గుంటూరుకు సమీపంలో ఉన్న బుడమేరు వాగుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. గంటల్లో బుడమేరు వాగు ఈ రెండు పట్టణాలపై విరుచుకుపడింది. గుంటూరులోని కొన్ని ప్రాంతాలు, విజయవాడ సిటీల్లోని కొన్ని కాలనీల్లో చూస్తుండగా 8 అడుగుల మేర అడగులకు మేర నీళ్లు వచ్చేశాయి. వరద నీరు ఇళ్లలోకి చేరింది . ఎటు చూసినా నీళ్లు కనిపించాయి. దీంతో జనాలకు ఏం చేయాలో తెలియదు. ప్రాణాలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. గుడ్డ గోడ అన్ని పోగొట్టుకుని నిరాశ్రయులయ్యారు. సాయం కోసం ఎదురు చూపు చూశారు. ప్రభుత్వం అప్రమత్తమైనా చాలా నష్టం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినా కొన్నివిషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వరద నీటిలో కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వరద నీటిలో చిక్కుకుని చిన్న పిల్లలు కూడా చనిపోయారు. ఆవులు, కుక్కలు, ఇతర పశువులు కూడా వేల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నాయి.

ఎన్నడూ చూడని విషాద గాధను రాష్ట్ర ప్రజలు చవి చూశారు. 334.2 మి మీ మేర కురిసిన వర్షం రికార్డు సృష్టించగా.. బుడమేరు బీభత్పం మాత్రం చరిత్రకెక్కింది. ఈ బీభత్సం దెబ్బకు విజయవాడ ప్రజలు గడగడలాడిపోయారు. ఈ భయానక వరదలు వచ్చి సరిగ్గా నేటికి సంవత్సరం అవుతోంది. ఈ పరిస్థితిని అటు విజయవాడ ప్రజలు, ప్రజా ప్రతినిధులు తలుచుకుని మళ్లీ పునరావృత్తం కాకూడదని కోరుకున్నారు. మనం సైతం అదే కోరుకుందాం.

Next Story