- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: ‘వెన్నుపోటు’ దినం పోస్టర్ ఆవిష్కరణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది...

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం( Coalition Government) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ ఏడాది పాటు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ లబ్ధిదారులకు రూ.4 వేలు అందజేస్తున్నారు. అమరావతి(Amaravati), పోలవరం(Polavaram), విశాఖ(Visakha)ను అభివృద్ధి చేస్తున్నారు. పేదల కోసం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను నిలిపివేశారు. రీసెంటుగా రేషన్ బియ్యం వ్యానులను రద్దు చేస్తూ ఉత్తర్వుల ఇచ్చారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులపై మండిపడుతున్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందనే విమర్శలు చేస్తున్నారు.
ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందంటూ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో విశాఖ(Visakha) క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటు’ దినం (Vennupotu Dinam) పోస్టర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భారీ ఎత్తున భాగస్వాములను చేయాలని, జూన్ 4న నిరసలు, ర్యాలీలు చేపట్టాలని, అలాగే అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఏడాది కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మోసాన్ని వివరించాలని పార్టీ శ్రేణులకు బొత్స దిశానిర్దేశం చేశారు.






