పాపం చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో.. ఐదేళ్లుగా పాలు, నీళ్లే ఆహారం

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-30 08:19:01  IST  )

అన్నప్రాసన రోజు తల్లిదండ్రులు అన్నం పెట్టగా వాంతి చేసుకున్న ఆ చిన్నారికి పెద్ద కష్టమే వచ్చింది.

పాపం చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో.. ఐదేళ్లుగా పాలు, నీళ్లే ఆహారం
X

దిశ,వెబ్‌డెస్క్: అన్నప్రాసన రోజు తల్లిదండ్రులు అన్నం పెట్టగా వాంతి చేసుకున్న ఆ చిన్నారికి పెద్ద కష్టమే వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా(Prakasam District) మార్కాపురం(Markapuram)లో రక్షణ అనే చిన్నారి ఐదేళ్లుగా పాలు, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. అయితే అన్న ప్రాసన రోజు అందరిలాగే తమ చిన్నారికి ఎంతో ఆనందంగా ఆ తల్లిదండ్రులు(Parents) అన్నం(Food) తినిపించారు. ఈ క్రమంలో అన్నం తిన్న వెంటనే ఆ చిన్నారి వాంతి చేసుకుంది. కానీ తల్లిదండ్రులు దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఇక మరుసటి రోజూ అన్నం పెట్టారు. మళ్లీ అదే విధంగా వాంతి చేసుకుంది. ఇలానే ఒక నెల రోజులు జరిగే సరికి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే ఆసుపత్రికి(Hospital) తీసుకెళ్లారు.

ఈ క్రమంలో వైద్యులు ప్రతి 10 లక్షల(10 Lakhs) మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి సోకిందని చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే ఆ చిన్నారికి అన్నవాహిక, పెద్దపేగు మూసుకుపోవడంతో ఏం తిన్నా వాంతులు అవుతున్నాయని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారికి పాలు(Milk), నీళ్లు(Water) మాత్రమే తాగించాలని వైద్యులు చెప్పడంతో ఆ చిన్నారి గత ఐదేళ్ల నుంచి పాలు, నీళ్లతోనే బతుకుతోంది. కుటుంబ(Family) పరిస్థితి అంతంత మాత్రమే. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. ఆ చిన్నారి కోసం ఆ తల్లిదండ్రులు(భాస్కర్, కృష్ణవేణి దంపతుల) పడే కన్నీటి వ్యధ వర్ణానాతీతం. పట్టణంలోనే ఒక ఆసుపత్రిలో భాస్కర్ కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు.

ఆ చిన్నారి ప్రాణాలను ఎలా రక్షించుకోవాలని ఆవేదనతో దీన స్థితిలో ఉన్న ఆ దంపతులు దాతల దయ కోసం ఎదురు చూస్తున్నారు. ‘‘ప్రస్తుతం మా చిన్నారి అంగన్‌వాడి పాఠశాలకు వెళుతోంది. ఆపరేషన్ చేస్తే ఇబ్బంది తొలుగుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ వైద్య ఖర్చుల(Medical expenses)కు సుమారు రూ.8లక్షలు అవుతుందని డాక్టర్లు తెలిపారు. పాప వైద్యం నిమిత్తం ప్రతి రెండు నెలలకు ఒకసారి రాజమండ్రికి వెళ్లి రూ.25 వేలు ఖర్చు పెట్టుకుని వస్తున్నాం. స్పందించే దాతలు 83743 89936 నంబరుకు సాయం చేయాలని కోరుతున్నాం. దాతలు స్పందించి మా చిన్నారి వైద్యానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాం’’ అని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Next Story