- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Sharmila: కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారత ఇదేనా?
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై వైఎస్ షర్మిల నిలదీశారు. అయితే రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కచ్చితంగా అమలవుతుందని, అయితే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం పై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్నలా’’ కూటమి ప్రభుత్వ తీరు ఉందని ఆమె ఫైరయ్యారు.
ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు పథకం(Free Bus Journey) విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని వైఎస్ షర్మిల విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ ఫ్రీ అంటూ ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం దారుణం అని వైఎస్ షర్మిల ఆరోపించారు. పథకం అమల్లోకి వచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అని ఎద్దేవా చేశారు. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పించే మహిళా సాధికారత? అని ఆమె ప్రశ్నించారు.
కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటినా ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Journey) కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోందని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని మహిళల తరపున కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వైఎస్ షర్మిల ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.






