- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర పోలీస్ శాఖలో పెను సంచలనం.. IPS సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ(AP Police Department)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ(AP Police Department)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్ అధికారి సిద్దార్థ్ కౌశల్(IPS officer Siddharth Kaushal) రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని.. నా రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖ విడుదల చేశారు. ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. ఇన్నేళ్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కాగా, ప్రస్తుతం ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా సిద్ధార్థ్ కౌశల్ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులోభాగంగా గత కొద్ది రోజులుగా ఆయన విధులకు సైతం హాజరుకావడం లేదని సమాచారం. గతంలో ఆయన కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా పని చేశారు.






