- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravathi: రాజధానిలో టవర్ల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
అమరావతి రాజధాని పనులు ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు నిధులు సమకూర్చకుంటూ టెండర్లను కూడా పిలుస్తున్నారు.

రూ.4,668 కోట్ల వ్యయంతో నిర్మాణం
వేగంగా అమరావతి నిర్మాణ పనులు
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు.. మంత్రులతో కమిటీ
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి రాజధాని (Rajadhani) పనులు ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు నిధులు సమకూర్చకుంటూ టెండర్లను (tenders) కూడా పిలుస్తున్నారు. తాజాగా రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్డియే (CRDA) ఈరోజు టెండర్లను ఆహ్వానించింది. సచివాలయానికి నాలుగు, హెచ్ ఓడీ కార్యాలయానికి ఒక టవర్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. హెచ్వోడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్లు పిలిచింది. సచివాలయం 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లతో మరో టెండర్ను ఆహ్వానించింది. సచివాలయం 3, 4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ అయ్యాయి. మొత్తం రూ.4,668 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మే 1న సచివాలయం, హెచ్ ఓడీ టవర్ల టెక్నికల్ బిడ్స్ తెరవనున్నారు. వీటితోపాటు సచివాలయంలో సీసీ కెమెరాలు,. కమాండ్ కంట్రోల్ కు టెండర్లు పిలిచారు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరం కాగా... వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ రూ.31,000 కోట్లు సమకూరాయి. ఇంకా నిధులు రూ.47,000 కోట్లు కావలపి ఉంది. ఈరోజు 16వ ఆర్ధిక సంఘ సభ్యులతో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఈ విషయాలను ప్రస్తావించారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చే నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారు. ఏపీలో ప్రధాని పర్యటన సక్సెస్ కు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, నారాయణను నియమించారు. మరో వైపు పురపాలక శాఖ మంత్రి నారాయణ అమరావతి రాజధానిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో రాజధానిలో టవర్ల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం పలకడం మరో ముందుడుగుగా అంతా భావిస్తున్నారు.






