- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో మరో భారీ మోసం.. వడ్డీల ఆశ చూపి 1200 మందికి బురిడీ
ప్రజల నమ్మకమే పెట్టుబడిగా కొందరు వ్యక్తులు, సంస్థలు తమ వ్యాపారాలకు ఆధారంగా చేసుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల నమ్మకమే పెట్టుబడిగా కొందరు వ్యక్తులు, సంస్థలు తమ వ్యాపారాలకు ఆధారంగా చేసుకుంటున్నారు. అధిక లాభాల పేరుతో ప్రజల వద్ద నుంచి భారీగా డబ్బు సేకరించి.. అనంతరం సంస్థను మూసేయడం వంటి మోసాలు ఇపుడు మళ్లీ బయటపడుతున్నాయి. తాజా ఉదాహరణ విజయవాడలో చోటుచేసుకుంది.
అద్విక ట్రేడింగ్ పేరుతో ఓ కంపెనీ అధిక వడ్డీ లాభాలు అందిస్తామని హామీ ఇచ్చింది. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు రూ. 6,000 లాభంగా వస్తుందని ప్రచారం చేసింది. దీనితో ఆకర్షితులైన ప్రజలు పెద్దఎత్తున సంస్థలో డబ్బు పెట్టడం ప్రారంభించారు.
అయితే సంస్థ కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. దీనితో మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సంస్థ నిర్వాహకుడు ఆదిత్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంస్థలో దాదాపు 1200 మందికి పైగా పెట్టుబడులు పెట్టగా.. మొత్తం రూ. 300 కోట్లు వరకు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.






