- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వైద్యుడిపై విచారణ.. బదిలీ!
ప్రభుత్వాస్పత్రుల సేవల్ని మెరుగుపర్చే ప్రయత్నాల్లో భాగంగా విధులు సరిగా నిర్వర్తించకుండా అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న డాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు.

దిశ, డైనమిక్బ్యూరో : ప్రభుత్వాస్పత్రుల సేవల్ని మెరుగుపర్చే ప్రయత్నాల్లో భాగంగా విధులు సరిగా నిర్వర్తించకుండా అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న డాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. గత ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రభుత్వ వైద్యుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించే వైఖరిపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ప్రభుత్వాస్పత్రిలో ఆర్థోపెడిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అంపోలు అచ్యుతరావును తక్షణమే ఏలూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి బదిలీ చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలిచ్చారు. ఆయనపై వచ్చిన పలు ఫిర్యాదులపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. డాక్టర్ అచ్యుతరావు వికలాంగులకిచ్చే సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు, ఆపరేషన్లు చేయడానికి డబ్బు తీసుకుంటున్నట్లు ఇతర ఆరోపణలు మంత్రి దృష్టికొచ్చాయి. దీంతో ఆయనపై చర్యలకు మంత్రి ఆదేశించారు.






