- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
బస్సులు.. బస్టాండుల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను కడప పోలీసులు (Kadapa Police) పట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బస్సులు.. బస్టాండుల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను కడప పోలీసులు (Kadapa Police) పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ (SP Nachiketh Viswanath) వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కడపలో ఇటీవల చోరీ ఘటనలు పెరిగిపోయాయి అన్నారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా ఉండే బస్సులు, బస్టాండుల్లో దొంగతనలు జరుగుతున్నాయన్నారు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు గత కొంత కాలంగా నిఘా పెంచారన్నారు. ఈ క్రమంలో ముఠా సభ్యులను అరెస్టు చేశారని తెలిపారు. కడపలో చోరీలకు పాల్పడుతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.75 లక్షలు విలువ చేసే బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నిందితులంతా తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారని తెలియజేశారు. కడపలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వారిపై కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి రెండు వారాల్లో బాధితులకు అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఎటువంటి చోరీలకు పాల్పడకుండా నిందితులపై కఠిన చర్యలు చేపడతామన్నారు. అందులో భాగంగా ముగ్గురిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఎస్పీ ప్రకటించారు.






