- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ
మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో (Amaravathi) ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ కానుంది.

దిశ, వెబ్ డెస్క్ : మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో (Amaravathi) ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ కానుంది. ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (MSK Prasad International Cricket Academy) పేరుతో నిర్మాణం కానున్న ఈ అకాడమీకి సోమవారం భూమి పూజ జరిగింది. భూమి పూజలో రిటైర్డ్ భారత క్రికెట్ ఎం.ఎస్.కె ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
12 ఎకరాల విస్తీర్ణంలో
ఎం.ఎస్.కె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ సముదాయంగా దీన్ని అభివృద్ధి చేస్తామని ఎం.ఎస్.కె ప్రసాద్ తెలిపారు. అకాడమీ ద్వారా స్థానిక క్రికెటర్లలో (Cricketers) ప్రతిభను పెంపొందిస్తామన్నారు. అమరావతిలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేస్తామని వివరించారు. అమరావతిలో నిర్మించనున్న సముదాయంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రికెట్ మైదానం, ప్రాక్టీస్ గ్రౌండ్లు, పూర్తి స్థాయిలో శిక్షణ సౌకర్యాలను కలిగి ఉంటుందన్నారు.
ఇంటిగ్రేటెడ్ క్యాంపస్
అమరావతిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ (Integrated Campus) లో ఆధునిక నెట్ లతోపాటు క్రీడాకారుల సామర్థ్య విశ్లేషణ వ్యవస్థలతో కూడిన ఇండోర్ ట్రైనింగ్ అకాడమీ ఉండనుంది. క్రీడలలో శిక్షణతో పాటు అంతర్జాతీయ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు కానుంది. క్రీడాకారులు, సందర్శక జట్ల కోసం వసతి, హాస్టల్ సౌకర్యాలు ఉంటాయి. స్థానికంగా టోర్నమెంట్ల నిర్వహణకు మినీ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తుంది. అత్యాధునిక జిమ్ లు, ఫిజియోథెరపీ, పునరావాస కేంద్రాలు సేవలందిస్తాయి. ఫిట్నెస్ కోసం ఆధునిక ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ సదుపాయాలు కలిగిన ఇండోర్, అవుట్ డోర్ ట్రైనింగ్ జోన్లు ఏర్పాటు కానున్నాయి. ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో ఈత కొలను, క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఉంటాయి.
పీఆర్డీఏ సహాయ సహకారాలు
ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్మాణం క్రీడల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (AP Government) సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ అంకిత భావం స్పష్టమవుతోంది. అమరావతిని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ అకాడమీ నిర్మాణానికి సీఆర్డీఏ పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది.






