- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుషికొండ ప్యాలెస్ పై దిగ్గజ సంస్థల ఆసక్తి
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్యాలెస్ ను లీజుకు తీసుకోవడానికి ముందుకొస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్యాలెస్ ను లీజుకు తీసుకోవడానికి ముందుకొస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ నేడు భేటీ అయ్యింది. సబ్ సంఘం భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. మంత్రి డీఎస్బీవీ స్వామి, అధికారులు వర్చువల్ గా భేటీకి హాజరయ్యారు. టాటా, లీలా గ్రూప్ వంటి పలు ప్రముఖ దిగ్గ సంస్థలు ప్యాలెస్ వినియోగానికి ముందుకొచ్చిన అంశంపై సమావేశంలో చర్చించారు. టూరిజం సహా పలురకాల వినియోగానికి సదరు సంస్థలు డీపీఆర్ ఇచ్చినట్లు మంత్రులు పేర్కొన్నారు. సంస్థలు ఇచ్చిన డీపీఆర్ లపై కేబినేట్ సబ్ కమిటీ లోతైన విశ్లేషణ చేసింది. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై కూడా చర్చించింది. మరోసారి ఎల్లుండి సమావేశం కావాలని తీర్మానించింది.
హోటల్ ఏర్పాటుతో ఉపయోగం : మంత్రి దుర్గేశ్
రుషి కొండ ప్యాలెస్ ను అందమైన హోటల్ గా మార్చగలిగితే మొత్తం ఉపయోగంలోకి వస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ అదనపు స్థలం లేదనేకంటే.. ఉన్న దాంట్లోనే రెండు ఫ్లోర్లు అదనంగా వేయాలని అభిప్రాయపడ్డారు. తద్వారా వంట గదులను అందుబాటులోకి తేవచ్చన్నారు. చివరి రెండు బ్లాకులు ప్రజలకు చిన్న ఈవెంట్ల నిర్వహణకు ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం వచ్చే భవనాలను కూలగొట్టి, ప్యాలెస్ కట్టిందన్నారు. అందువల్లనే నేడు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తాం : మంత్రి కేశవ్
రుషికొండ ప్యాలెస్ పై చాలా ప్రతిపాదనలు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తాజ్, లీలీ గ్రూప్ వంటి సంస్థల ప్రతిపాదనలు తమ పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చివరి రెండు బ్లాకులను పర్యాటకుల కోసం కేటాయించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ విషయమై ఎల్లుండి మరోసారి భేటీ అవుతామని ప్రకటించారు.






