ఇంటర్ విద్యార్థినిని దారుణ హత్య.. పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు

by Vemula.Srinu Prasad |

ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది..

ఇంటర్ విద్యార్థినిని దారుణ హత్య.. పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం వన్ టౌన్ పరిధిలో జరిగింది. స్థానిక స్కూల్ వెనుక విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటర్ విద్యార్థిని మృతదేహంగా గుర్తించారు. విద్యార్థినిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మృతదేహం మొత్తం కాలిపోయింది.

అయితే తమ కూతురు కనిపించడంలేదని వారం క్రితం అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే స్థానిక స్కూలు వెనుక వైపు విద్యార్థిని మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని, అందువల్లే తమ కూతురు హత్యకు గురైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story