Inter Exams: నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. సర్వం సిద్ధం చేసిన అధికారులు

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు (Intermediate Examinations) ప్రారంభం కానున్నాయి.

Inter Exams: నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. సర్వం సిద్ధం చేసిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు (Intermediate Examinations) ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వురకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష జరగనుంది. ఇక సోమవారం నుంచి ఇంటర్ ద్వీతీయ సంవత్సరం పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు మొత్తం 1,535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మరోవైపు మాస్ కాపీయింగ్‌ (Mass Copying)ను నిరోధించేందుకు ఇప్పటికే ఆయా ఎగ్జామ్ సెంటర్లలో పకడ్బందీగా సీసీ కెమేరాలను (CC Cameras) ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ (Online) ద్వారా ఉన్నతాధికారుల కార్యాలయాలకు లింక్ చేశారు.

అదేవిధంగా పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్‌ జోన్‌’ (No Mobile Zone)గా ప్రకటించి 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఆయా ఏరియాల్లో ఉన్న జిరాక్స్ (Xerox), ఇంటర్‌నెట్ సెంటర్ల (Internet Centers)ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా గంట ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. 8.30 గంటలకు ఓఎంఆర్ షీట్లు (OMR Sheets) అందజేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుతించేది లేదని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇప్పటికై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Next Story