ప్రభుత్వానికి బిగ్ షాక్.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందుకు రాని సంస్థలు

by Vemula.Srinu Prasad |

ప్రభుత్వ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంస్థలు ముందుకు రాలేదు...

ప్రభుత్వానికి బిగ్ షాక్.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందుకు రాని సంస్థలు
X

దిశ, వెబ్ డెస్క్: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం(Quality medicine) అందించేందుకు మెడికల్ కాలేజీల(Medical Colleges) నిర్మాణానికి ప్రభుత్వం(Government) పీపీపీ(PPP) విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంస్థలు ముందుకు రాలేదు. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం టెండర్లు(Govt Tenders)దాఖలు చేసేందుకు సమయం ఇచ్చిది. అయితే ఈ గడువు బుధవారం సాయంత్రంలో ముగిసింది. ఒక్క ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి మాత్రమే బిడ్ దాఖలు అయింది. కిమ్స్ ఆస్పత్రి టెండర్ వేసింది. మిలిగిన మూడు కాలేజీలకు టెండర్లు దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకు రాలేదు. దీంతో పీపీపీ విధానం దేశవ్యాప్తంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గమని ప్రకటించింది. దీంతో ఈ మూడు మెడికల్ కాలేజీలకు మళ్లీ టెండర్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. చూడాలి మరి.

Next Story