ఏనుగుల గుంపుతో పోరాటం.. చిత్తూరు ఫారెస్ట్‌లోని గాయపడ్డ ఏనుగు.. చికిత్స పొందుతూ మృతి

by Ramesh Naini |

చిత్తూరు పరదరామి అటవీ ప్రాంతంలో గాయపడిన ఏనుగు ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఏనుగుల గుంపుతో పోరాటం.. చిత్తూరు ఫారెస్ట్‌లోని గాయపడ్డ ఏనుగు.. చికిత్స పొందుతూ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్తూరు పరదరామి అటవీ ప్రాంతంలో గాయపడిన ఏనుగు ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్వీ జూ పార్క్ లో పోస్టుమార్టం నిర్వహించి ఏనుగును ఖననం చేశారు. గత నెల 30న చిత్తూరు పరదరామి రిజర్వ్ ఫారెస్ట్ లోని గుడ్డివాని చెరువులో ఏనుగు గాయపడింది. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు, రెస్క్యూ సిబ్బందిచే మత్తుమందు ఇచ్చి తిరుపతి జూ పార్కు తరలించారు. రెండు రోజుల నుంచి క్రమంగా ఆహారం మానివేయడంతో పశు వైద్య అధికారులు ద్రవ రూపంలో ఆహారం పంపిణీ చేశారు. పూర్తిగా ఆరోగ్యం క్షీణించి ఈ రోజు తెల్లవారుజామున ఏనుగు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపులో జరిగిన పోరాటంలో గాయపడి, నీటి బురదలో ఎక్కువ సేపు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ సోకడం తో మృతి చెందినట్లు పోస్టుమార్టం ద్వారా వెటర్నరీ వైద్యులు తేల్చారు.

Next Story