- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పామూరు మండలంలో అమానుష ఘటన
నానాటికీ ప్రజల మధ్య పెరుగుతున్న అంతరాలు.

దిశ, వెబ్ డెస్క్ : మార్కాపురం జిల్లా పామూరు (Pamuru) మండలంలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండలంలోని బోట్లగూడూరు గ్రామంలో ఒక ఆటో డ్రైవర్‌పై (Auto Driver) గ్రామస్తులు కర్కశంగా దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం చీమలదిన్నె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వాహనం నడుపుతుండగా, బోట్లగూడూరు (BotlaGuduru) వద్ద ప్రమాదవశాత్తు ఒక వ్యక్తికి ఆటో తగిలిందనే నెపంతో అక్కడి స్థానికులు రెచ్చిపోయారు. కనీస కనికరం లేకుండా డ్రైవర్‌ను పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి, విచక్షణారహితంగా చితకబాదారు. ఒక చిన్న ప్రమాదాన్ని సాకుగా చూపి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గ్రామస్తుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో విషయం తెలుసుకున్న చీమలదిన్నె గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన రెండు గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి నెలకొంది. ఆటో డ్రైవర్‌పై జరిగిన మూకదాడి కేవలం ఒక ప్రమాదం వల్ల జరిగింది కాదని, దీని వెనుక వర్గ పోరు కూడా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని కుటుంబ సభ్యులు, చీమలదిన్నె గ్రామస్థులు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయకుడైన డ్రైవర్‌ను స్తంభానికి కట్టేసి కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేయాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. బాధితుడి స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి, దోషులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
Read More..






