- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు మైనర్లే.. అన్నమయ్య జిల్లా బురకాయలకోటలో అమానవీయ ఘటన
by Ramesh Naini |
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. జంతువుపై అనుచిత చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒక ఆవు దూడపై ఇద్దరు మైనర్లు అనుచితంగా ప్రవర్తించినట్లు అరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి, సంబంధిత మైనర్లను కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
చట్టపరమైన విధానాల ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, దీనిపై విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Next Story






