ఇంద్రకీలాద్రి ఉత్సవాలు షరూ.. బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు

by Kema Shiva Kumar |

విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విజయదశమి ఉత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఇంద్రకీలాద్రి ఉత్సవాలు షరూ.. బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విజయదశమి ఉత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి (Bala Tripura Sundari)గా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలకు అనుమతించున్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పిచనున్నారు. నేటితో ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబరు 2 వరకు కొనసాగునున్నాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 11 రోజుల్లో మొత్తం 11 రూపాల్లో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. అయితే, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ‘దసరా-2025’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా సెప్టెంబరు 29న సోమవారం సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సతీసమేతం దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Next Story