- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : ముఖ్యమంత్రి
ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు

దిశ, వెబ్ డెస్క్ : ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఏపీ హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. 2014లో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా (Economy) ఉందన్నారు. ఇప్పుడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ (Bharat) మారుతుందన్నారు. 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
రాజ్యాంగం వల్లనే..
డాక్టర్ బిఆర్ఎస్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం (Constitution) రూపొందించారని ముఖ్యమంత్రి అన్నారు. చాయ్ వాలా దేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే అది రాజ్యాంగం వల్లనేనని పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కావొస్తుండడం గర్వకారణం అన్నారు. ప్రతిఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని ఆకాంక్షించారు.






