Cyclone Montha: దక్షిణ కోస్తా జిల్లాలకు ఐఎండీ హై అలర్ట్.. కళింగపట్నం - మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది.

Cyclone Montha: దక్షిణ కోస్తా జిల్లాలకు ఐఎండీ హై అలర్ట్.. కళింగపట్నం - మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉండనుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ వైపు దూసుకొస్తున్న మొంథా తుపాను.. కళింగపట్నం - మచిలీపట్నం తీరాల మధ్య కాకినాడ సమీపంలో ఈనెల 28న రాత్రికి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ తుపాను ప్రభావంతో ఈనెల 27, 28 తేదీల్లో ఏపీలో.. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తుపాను ఎఫెక్ట్ విశాఖపట్నం నుంచి తిరుపతి వరకూ ఉండనుందని తెలిపింది.

అతిభారీ వర్షసూచనల నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకు 28,29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేయాలని వాతావరణశాఖ సూచించింది.

Next Story