అహింసా మార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించారు : సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 03:54:53  IST  )

నేడు మహాత్మా గాంధీజి 78వ వర్ధంతి.

అహింసా మార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించారు : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : మహాత్మా గాంధీ స్వరగస్తులై నేటితో 78 సంవత్సరాలు పూర్తవుతోంది. ఆయన 78 ఏళ్ల వయసులోనే నాథూరాం గాడ్సే అనే వ్యక్తి చేతిలో తుపాకీ తూటాకు బలయ్యారు. 1948 జనవరి 30న దిల్లీలోని బిర్లా హౌజ్ లో సాయంత్రం ప్రార్థనకు వెళ్లే క్రమంలో ఆయనపై మూడుసార్లు కాల్పులు జరగగా అక్కడికక్కడే ప్రాణాలను విడిచారు. ఆయన మరణించిన రోజును గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది గాంధీ వర్ధంతిని భారతీయులు నిర్వహించుకుంటున్నారు. నేడు గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని దిల్లీలోని రాజ్ ఘాట్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘన నివాళులు అర్పించనున్నారు. అదే విధంగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల పాటు ప్రజలంతా మౌనం పాటించిన శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

మహాత్మా గాంధీ వర్ధంతిని (Gandhi Death Anniversary) పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అహింసా విధానంతో కోట్లాది మంది దేశ ప్రజలను కార్యోన్ముఖులను చేసిన ఘనత గాంధీజీకి దక్కుతుందన్నారు. ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి వారందరినీ ఏకతాటిపై నడిపించారన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించారని కొనియాడారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ (Satyam, Ahimsa, Shanti, Seva) అనే సిద్ధాంతాలను ప్రతిఒక్కరూ నిత్య జీవితంలో పాటించాలని ఆకాంక్షించారు. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పని చేద్దామని సీఎం దేశ, రాష్ట్ర నాయకులకు పిలుపునిచ్చారు.

Next Story