- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిద్రిస్తున్న విద్యార్థిని పై క్షుద్రపూజలు.. ఆ రాత్రి హాస్టల్‌లో ఏం జరిగిందంటే?
రాత్రికి రాత్రే ఆ కాలేజీలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాత్రికి రాత్రే ఆ కాలేజీలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. SR విద్యాసంస్థల్లో క్షుద్ర పూజలు(Occult Worship) కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా(Karnool District) బి తాండ్రపాడు ఎస్‌ఆర్ కాలేజీ(SR College)లో బైపీసీ ఫస్ట్ ఇయర్(First Year) చదువుతున్న విద్యార్థినిపై దుండగులు హత్యాయత్నం చేసినట్లు సమాచారం. విద్యార్థిని నిద్రిస్తున్న సమయంలో జుట్టుని కట్ చేసి, పదునైన కత్తితో చెయ్యిని కోసే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థిని గట్టిగా కేకలు వేయడంతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. జనవరి 26న రాత్రి 11.30 గంటల సమయంలో హాస్టల్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గదిలో చూడగా బెడ్ పై కిల్‌యూ అని లేటర్, పదునైన కత్తి, రెండు ముక్కలు చేసిన నిమ్మకాయ, ఉండటంతో క్షద్ర పూజలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
అయితే ఆ గదిలో ఏడుగురు విద్యార్థులు ఉండగా.. ఆ విద్యార్థినిపై టార్గెట్ చేయడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కాలేజీ యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. ఈ క్రమంలో తోటి విద్యార్థి ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన SFI విద్యార్థి సంఘం, మహిళా సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలో కూడా ఈ విధంగా జరిగాయని విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ క్షద్ర పూజలు వెలుగులోకి రావడంతో విద్యార్థినీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.






