మండలిలో మాటల యుద్ధం.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై చర్చ నేపథ్యంలో క్రిడిట్ కోసం అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులు పోటీ పడ్డారు.

మండలిలో మాటల యుద్ధం.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలి(AP Legislative Council) వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) సభ్యుల మాటల యుద్ధంతో దద్దరిల్లింది. రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై చర్చ నేపథ్యంలో క్రిడిట్ కోసం అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులు పోటీ పడ్డారు. తమ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని, ఆ క్రెడిట్‌ను హైజాక్ చేస్తున్నారని వైసీపీ.. జగన్(Jagan) సమయంలో అన్ని అరాచకాలు, దాడులే జరిగాయని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఇక విజయగనరం జిల్లాలో నిర్మిస్తున్న బోగాపురం ఎయిర్ పోర్టు పనులపైనా శాసనమండలిలో ప్రశ్నల వర్షం కురిసింది. భోగాపురం ఎయిర్ పోర్టు(Bhogapuram Airport)కు టీడీపీ హయాంలో జరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ సూర్య నారాయణ(MLC Surya Narayana) వ్యాఖ్యానించారు. భూసేకరణ నుంచి కోర్టు కేసులన్నీ జగన్ హయాంలోనే పరిష్కారం అయిందని తెలిపారు. జగన్ హయాంలో జరిగినవి చంద్రబాబు హైజాక్ చేస్తున్నారని బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

2014-19లో కర్నూలుకు ఎయిర్‌పోర్టు తీసుకొచ్చామని బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. రన్ వే‌తో పాటు విమానాలు కూడా వచ్చాయని గుర్తు చేశారు. కానీ తాము చేసిన పనులకు మళ్లీ ప్రారంభించారని, ఏ సంబంధం లేని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారని తెలిపారు. కర్నూలు ఎయిర్ పోర్టును తాము నిర్మిస్తే తమ క్రెడిట్ ను ఎవరు హైజాక్ చేశారని ప్రశ్నించారు. వెలిగొండ, కుప్పం ప్రాజెక్టులకు పనులు చేసిందెవరు.. హైజాక్ చేసిందెవరని నిలదీశారు. ఎవరో చేసిన పనులను హైజాక్ చేయాల్సిన అవసరం లేదని, తాము చేసిన పనులను మాత్రమే చెప్పుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story