- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైసీపీకి భారీ షాక్.. మరో కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరనున్నారంటే?
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రానున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా వైసీపీ అధిష్టానం అడుగులేస్తోంది. అయితే తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు అన్నట్లు ఉంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతూ షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు పార్టీకి బైబై చెప్పేసారు.
ఇక తాజాగా వైసీపీ మరో కీలకనేత మంత్రి గుమ్మనూరు జయరాం ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ రోజు విజయవాడలో గుమ్మనూరు జయరాం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక అలానే నేడు టీడీపీ నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో అయన పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆ సభలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఇక తాను పార్టీ వీడడానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. జగన్ విధానాలతో తాను విసుగుచెందానని గుమ్మనూరు ఆరోపించారు. ఇక సీఎం జగన్ తనను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అడిగినట్లు పేర్కొన్నారు.
అయితే తనకు అది ఇష్టం లేదని.. అందుకే తాను పార్టీకి రాజీనామా ఇస్తున్నట్లు తెలిపారు. ఇక తానూ టీడీపీ తరుపున గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read More..
సిద్ధం సభలో ఎంపీ పై ఫైర్ అయిన ఆదిరెడ్డి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?