- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: లా అండ్ ఆర్డర్ లో.. నో కాంప్రమైజ్
శాంతి భద్రతల పర్యవేక్షణలో రాజీ పడే ఉద్దేశమే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

* నేరస్తులను వెనకేసుకురాం..
* అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం
* పిఠాపురానికి వరాల జల్లు
* 100 కోట్లతో అభివృద్ధి పనులు
* ప్రారంభించిన డీసీఎం పవన్ కళ్యాణ్
దిశ, డైనమిక్ బ్యూరో: శాంతి భద్రతల పర్యవేక్షణలో రాజీ పడే ఉద్దేశమే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు పిఠాపురం (Pithapuram)నియోజకవర్గంలో 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పిఠాపురం పట్టణంలో 30 గదులతో కూడిన 100 పడకల ఆసుపత్రి (100 beds hospital) నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత పిఠాపురం మండలం చేబ్రోలు గ్రామంలో టిటిడి కళ్యాణ మండపం, శ్రీ సీతారామస్వామి ఆలయంలో రథసాల నిర్మాణం, ఆలయ కాలక్షేపమండపం, నూతన ఆలయ ప్రాకార మండపాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా ఉప్పాడ, కొత్తపల్లి మండలంలో వివిధ దేవాలయాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులకు పనిముట్ల తో పాటు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు 100 కోట్లతో నియోజకవర్గంలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీడియా వివరించారు.
ప్రధాని మోదీ సహకారంతో ఏడాదిలోపే పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు. పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని గతంలో మీరు ఆరోపించారు... ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులను కాదన్నారు. క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఐజి స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి పైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అందరం కలిసి పనిచేస్తున్నామని మరోసారి తెలిపారు.






