- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Alert:భక్తులకు ముఖ్య గమనిక.. స్పర్శ దర్శనాలు రద్దు
ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ప్రముఖ జ్యోతిర్లింగా పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులకు ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. శ్రీశైలంలో కొలువైన మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఈ క్రమంలో కొన్ని సార్లు భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీశైలం మల్లన్న ఆలయ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు.






