తుఫాను నేపథ్యంలో తక్షణ స్పందన : సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |

మొంథా తుఫాను నేపథ్యంలో సహాయక చర్యల విషయమై తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

తుఫాను నేపథ్యంలో తక్షణ స్పందన : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను నేపథ్యంలో సహాయక చర్యల విషయమై తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సహాయక చర్యల విషయమై నిరంతర టెలీ కాన్ఫరెన్సులు సీఎం నిర్వహిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి వరకు సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో తుఫాను ప్రభావాన్ని పరిశీలించారు. తుఫాన్ తీరం దాటడంతో పరిస్థితిని అంచనా వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మొంథా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నారు. భీకరమైన గాలుల కారణంగా చెట్లు విరిగిపడితే వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులు, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. తుఫాను బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని వారిని ఆదేశించామన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించేలా క్షేత్ర స్థాయి సిబ్బంది పని చేస్తున్నారని తెలియజేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలవాసులు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలు వెళ్ళాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.

Next Story