- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నైరుతి రుతుపవనాల రాక.. ఏపీకి హెచ్చరిక, ఈ రాష్ట్రాల్లో ధూళి తుఫాన్!
ముఖ్యంగా నైరుతి రుతుపవనాల (South East Monsoon) ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు (Heavy to Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మండుటెండల నుంచి ముందే ఉపశమనం కలుగనుంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఐఎండీ (IMD) పలు రాష్ట్రాలకు అతిభారీ వర్షసూచన (Heavy Rains Alert) చేసింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల (South East Monsoon) ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు (Heavy to Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇక ఏపీలో నేడు పలు జిల్లాల్లో పిడుగులు (Thunder Storms in AP) పడే ప్రమాదం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాయలసీమలో (Rayalaseema Weather) పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే కోస్తాలో తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉందని, చెదురుమదురుగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు పిడుగులు పడే ప్రమాదం ఉందని, ఉత్తరాంధ్రవాసులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
ప్రస్తుతం ఉమ్మడి, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. ఒంగోలు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు, కూలీలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాల అధికారులు హెచ్చరించారు.






